వైకాపా ఏడాది పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి, వ్యవస్థలను నాశనం చేశారని... తెదేపా అధికార ప్రతినిథి బొండా ఉమ విమర్శించారు. ప్రభుత్వ విధ్వంస పాలనపై చర్చకు సిద్ధమని స్పష్టంచేశారు. వైకాపా నేత గడికోట శ్రీకాంత్ మంత్రి పదవికోసం జగన్కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. రూ. 10 కోట్ల విలువైన ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు.
వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని, అమరావతిని.. నాశనం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క రాజధాని కట్టడం చేతగాని వైకాపా 3 రాజధానులు కడతామని చెప్పడం హాస్యాస్పదన్నారు. విశాఖలో దోచుకున్న 30 వేల ఎకరాల భూముల ధరలు పెంచుకోవడం కోసమే.. రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.