AYYANNA:బెయిల్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి దిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి.. తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తాను అజ్ఞాతంలో ఉన్నానడం అవాస్తవమని.. నర్సీపట్నంలోనే ఉన్నానని తెలిపారు. విజయసాయిరెడ్డి ఎప్పుడొచ్చినా తాను సిద్దమేనని.. దీనికి ముహూర్తమెందుకని ప్రశ్నించారు.
ముహూర్తం ఎందుకు.. ఎప్పుడొచ్చినా నేను సిద్ధమే: అయ్యన్నపాత్రుడు - అయ్యన్న పాత్రుడు తాజా వార్తలు
AYYANNA: "నేను అజ్ఞాతంలో ఉన్నానని విజయసాయిరెడ్డి అంటున్నారు.. కానీ నేను నర్సీపట్నంలోనే ఉన్నాను" అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. తనకు తాను పులిని అనుకుంటున్న విజయసాయి రెడ్డి.. పోలీసులతో కాకుండా సింగిల్‌గా వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
AYYANNA
విజయసాయి రెడ్డి పులి అయితే.. పోలీసుల్ని వేసుకొని రాడని.. సింగిల్‌గా రావాలని సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి 16 నెలల పాటు జైలు భోజనం తినడం వల్ల శరీరం మందపడిందని ఎద్దేవా చేశారు. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయసాయి రెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదని అయన్నపాత్రుడు సైటెర్లు వేశారు.
ఇవీ చదవండి: