ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రజా సమస్యల్ని ప్రస్తావించటంలో విఫలమైందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కేవలం రాజకీయ కక్షతోనే తెదేపా సభ్యులు శాసనసభకు వచ్చినట్టు కనిపించిందని ఆయన ఆరోపించారు. శాసనసభ సమావేశాలను సమర్ధవతంగా నిర్వహించామని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. 18 నెలల కాలంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభ, మండలి ముందు ఉంచామని ఆయన వివరించారు.
ప్రజా సమస్యల్ని ప్రస్తావించటంలో తెదేపా విఫలం: బొత్స - Botsa comments On chandrababu
ప్రజా సమస్యల్ని ప్రస్తావించటంలో తెదేపా విఫలమైందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 18 నెలల కాలంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభ, మండలి ముందు ఉంచామని ఆయన వివరించారు. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించబోమని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు.
చంద్రబాబు సీనియర్ నేత, మాజీముఖ్యమంత్రి అయి ఉండి సభా కార్యక్రమాలకు పదేపదే విఘాతం కలిగించారని బొత్స ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో శాసనసభ పోడియం ఎదుట ప్రతిపక్ష నేత కూర్చున్న దాఖలాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. సంఖ్య పరంగా సభలో మాట్లాడే అవకాశం ప్రతిపక్షానికి కల్పించామన్నారు. చంద్రబాబు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించటం మానేసి అసత్యాలతో ఉపన్యాసాలు చెప్పారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించబోమని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు.
ఇదీ చదవండీ... మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇచ్చి ఆదుకోవాలి: పవన్