చంద్రబాబు అధికారంలో ఉండగా కుటుంబంతో సహా ఖరీదైన హోటల్లో బస చేశారని... ఇందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న జనసేన ట్విట్టర్ విమర్శలపై తెదేపా అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు తన విలాసాల కోసం ప్రజా ధనాన్ని ఎప్పుడూ వాడుకోలేదని తెదేపా పేర్కొంది. చంద్రబాబు కుటుంబం హోటల్లో బస చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను.. ఆయన సతీమణి భువనేశ్వరి చేసిన చెల్లింపుల వివరాలను పార్టీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సాక్ష్యాలను చూసైనా జనసేన మీడియా అసత్య ప్రచారం మానుకోవాలని తెదేపా నేతలు హితవు పలికారు.
జనసేన ట్వీట్‌పై తెదేపా తీవ్ర అభ్యంతరం - tdp criticised janasena media through twitter
ప్రజాధనాన్ని తమ విలాసాల కోసం చంద్రబాబు వాడుకున్నారన్న జనసేన ట్విట్టర్‌పై తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేన చేసిన ఆరోపణలకు సంబంధించిన అప్పటి చంద్రబాబు కుటుంబం హోటల్ బిల్లుల చెల్లింపుల వివరాలను పార్టీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇది చూసైనా జనసేన మీడియా అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికింది.
జనసేన ట్వీట్‌పై తెదేపా తీవ్ర అభ్యంతరం