ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandrababu: 'తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని పాలన ఇది' - gidugu ramamurthy latest news

ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలను తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. తెలుగునాట వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. తెలుగుకు, సంస్కృతానికి తేడా తెలియని వైకాపా పాలనలో గిడుగు ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.

Chandrababu
చంద్రబాబు

By

Published : Aug 29, 2021, 10:35 AM IST

తెలుగునాట వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామ్మూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. వాడుకలోని తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూలకారణం రామ్మూర్తి గారే అని కొనియాడారు.

ప్రజలలో అక్షరాస్యత పెరగాలంటే మాతృభాషలోనే బోధన జరగాలని రామ్మూర్తి విశ్వసించారని... అందుకే ఏకంగా గిరిజన భాషా మాధ్యమంలో ఒక పాఠశాలనే తెరిచారని కొనియాడారు. అటువంటిది తెలుగుకు, సంస్కృతానికి తేడా తెలియని వైకాపా పాలనలో గిడుగు ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోధనా భాషగా, పాలనా భాషగా ఉన్నప్పుడు ఏ భాషకైనా మరింత రాణింపు ఉంటుంది. తెలుగు భాషకు వైకాపా ఆ ప్రాప్తం లేకుండా చేస్తోందని ఆరోపించారు. తెలుగు భాషను నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తోన్న ఈ ప్రభుత్వం నుంచి మన అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిపైనా ఉందన్నారు.

ఇదీ చదవండి

అమెరికాలోనూ అమ్మ భాష..

ABOUT THE AUTHOR

...view details