ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎంది మూర్ఖత్వం.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు: చంద్రబాబు - chandrababu on cm jagan

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్యమంత్రి జగన్ తీరుపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని.. దేశ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని ట్వీట్ చేశారు.

chandrababu

By

Published : Nov 13, 2019, 4:45 PM IST

చంద్రబాబు ట్వీట్

''ప్రజలంతా చేయీ చేయీ కలిపి నిరంకుశ పాలకుడికి పాఠం నేర్పాలి'' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యుత్ ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం అగౌరవపరచడంపై జపాన్‌ భారతదేశాన్ని అప్రమత్తం చేసిందన్నారు. అక్కడి మీడియా ప్రచురించిన కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కారణం లేకుండా ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ నిర్వీర్యం అవడంపై ఐరిష్ మీడియా ప్రచురించిన కథనాన్ని ఉదహరించారు. సింగపూర్‌ ప్రభుత్వం ఏపీతో ఒప్పందాన్ని రద్దుచేసుకోవడంపై ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు ఆగ్రహంతో స్పందించిన తీరునూ ట్వీట్ చేశారు. ''తన మూర్ఖత్వంతో జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేయడమే కాకుండా భారతదేశపు బ్రాండ్‌ఇమేజిని దెబ్బ తీస్తున్నారు'' అంటూ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details