CBN On Ongole Incident: ఒంగోలులో కారు స్వాధీనం ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. భార్య, పిల్లలతో తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారు లాక్కెళ్తారా అని మండిపడ్డారు. కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడితే.. ప్రజలకు ఏం సమాధానం చెబుతారని దుయ్యబట్టారు. సీఎం వస్తే దుకాణాలు మూసేయడం లాంటివే కాకుండా కాన్వాయ్ కోసం కార్లను సైతం లాక్కెళ్తారా అని మండిపడ్డారు.
రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనం: చంద్రబాబు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
CBN On Ongole Incident: ఒంగోలులో కారు స్వాధీనం ఘటనపై ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు.
కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లింది