ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేవాలయాల ఆస్తులపై వైకాపా కన్ను: బుచ్చిరాం ప్రసాద్ - దేవాలయాల భూములపై టీడీపీ కామెంట్స్

వైకాపా ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు చేపడుతోందని ఇండో - అమెరికన్ బ్రాహ్మణ సంఘం ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ ఆరోపించారు. హిందూ దేవాలయాల భూములలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జీవో జారీచేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కార్పొరేషన్ల నిధులను నవరత్నాలకు మళ్లించడం సరికాదన్నారు.

బుచ్చిరాం ప్రసాద్
బుచ్చిరాం ప్రసాద్

By

Published : Jun 23, 2020, 4:29 PM IST

వైకాపా ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఇండో - అమెరికన్ బ్రాహ్మణ సంఘం ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ మండిపడ్డారు. శ్రీశైలం ఆలయంలో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల ఆస్తులపై వైకాపా ప్రభుత్వం కన్నేసిందని, దేవాలయ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో తేవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. నవరత్నాల కోసం కార్పొరేషన్ల నిధులను దారి మళ్లించడం సరికాదని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details