ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'శాంపిల్స్ వృథాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి'

కరోనా టెస్టులు చేస్తున్నామని డబ్బా కొట్టుకోవడం తప్ప సేకరించిన శాంపిల్స్ ఏమౌతున్నాయో ప్రభుత్వానికి కనబడటం లేదని టీడీఎల్పీ విప్, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు.

By

Published : Jul 14, 2020, 10:16 PM IST

Published : Jul 14, 2020, 10:16 PM IST

tdlp whip dola balaveeranjaneyaswami fire on ycp governament
ప్రభుత్వంపై మండిపడ్డ టీడీఎల్పీ విప్

ప్రభుత్వంపై మండిపడ్డ టీడీఎల్పీ విప్

ఐసీఎమ్ఆర్ సూచనలను లెక్కలేని తనంగా వైకాపా ప్రభుత్వం తీసుకుంటోందని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కరోనా నిర్ధరణ కోసం తీసుకున్న 74 వేల శాంపిళ్లు మాయం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.

ప్రకాశం జిల్లాలో 27 వేల శాంపిళ్లు మాయమయ్యాయన్న స్వామి... క్వారంటైన్ కేంద్రాల్లో పాచిపోయిన భోజనం, ఈగలు, దోమలు పడిన నీళ్ల ప్యాకెట్లను అందిస్తున్నారని విమర్శించారు. అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టి రోగులకు అందించే భోజనాల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details