Niharika in Pub Drugs Case: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడిలో పబ్ యజమాని సహా 144 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సినీనటి నిహారికతోపాటు పలువురు సినీ, ఇతర ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. వారి వివరాలు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు అందరినీ వదిలేశారు.
హైదరాబాద్‌లో పుడింగ్ మింక్ పబ్‌పై పోలీసుల దాడులు.. పట్టుబడిన సినీ ప్రముఖులు డ్రగ్స్ కలకలం:పబ్‌లో నిర్వహించిన తనిఖీల్లో కొకైన్, గంజాయి, ఎల్ఎస్డీని పోలీసులు గుర్తించారు. అధికారులు అక్కడికి చేరుకోగానే పలువురు.. మత్తుపదార్థాలను విసిరేసినట్లు తెలుస్తోంది.అసలు పబ్‌లోకి డ్రగ్స్ ఎలా చేరాయి..? ఎవరెవరు మత్తుపదార్థాలు తీసుకున్నారనే విషయాలు సంచలనం రేపుతున్నాయి. పబ్‌లోకి డ్రగ్స్ ఎలా చేరాయి.. ఎవరెవరు వినియోగించారనే దానిపై పోలీసులు దృష్టిసారించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులపై వేటు:పబ్ డ్రగ్స్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బంజారాహిల్స్ సీఐ శివచంద్రన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఏసీపీ సుదర్శన్‌కు ఉన్నతాధికారులు ఛార్జ్ మెమో దాఖలు చేశారు. గతంలోనే పబ్‌పై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదనే ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు.
అర్ధరాత్రి దాటాక మెరుపు దాడి: బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని ఈ తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. హోటల్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం వేకువజామున 2.30 గంటల సమయంలో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సమయానికి మించి పబ్ నడపడంతో పాటు రేవ్ పార్టీని నిర్వహిస్తుండటంతో పబ్ యజమానులు సహా సుమారు 144 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పబ్ ఓ మాజీ ఎంపీ కూతురిదని తెలుస్తోంది.
మాజీ ఎంపీ కూతురిదనే కారణంతోనేనా.?:పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే డ్రగ్స్ దందా బయటపడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై స్థానికులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్ ఓ మాజీ ఎంపీ కూతురిది కావడంతో.. నిబంధనలు మీరి తెల్లవారుజాము 3 గంటల వరకు పబ్ నడిపినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇవాళ పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడులు చేసిన పోలీసులు.. సమయానికి మించి పబ్ నడుపుతున్నందుకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పలువురు యువకులు తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ఆందోళన చేయగా.. అందరి వివరాలూ నమోదు చేసుకుని వదిలేశారు.
ఇదీ చదవండి:హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ సానుభూతిపరుడి అరెస్ట్