ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో దారుణం.. ఆస్తి కోసం అమ్మ, చెల్లి దారుణ హత్య - Suryapet District today News

ఆస్తిపై ఆరాటంతో అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. కొందరు వ్యక్తులు ఎంతటి నేరానికైనా వెనుకంజ వేయడం లేదు. ఆస్తి తనకే దక్కాలన్న కుట్రతో సవతి తల్లి, ఆమె కూతురిని ఓ వ్యక్తి హత్య చేసిన సంఘటన తెలంగాణ సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. నిందితుడు రోకలిబండతో ఇద్దరిని హత్యచేసి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

suryapet-district-murder-latest-news
suryapet-district-murder-latest-news

By

Published : Feb 6, 2020, 4:55 PM IST

ఆస్తి కోసం అమ్మను, చెల్లిని దారుణంగా చంపేశాడు!

తెలంగాణలోని సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మంపహాడ్​లో దారుణం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున గ్రామంలోని తల్లీకూతురు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన కప్పల హరీశ్​ అనే యువకుడు సవతి తల్లి అంజమ్మ, ఆమె కూతురు మౌనికను హత్య చేశాడు. ఆస్తి తనకే దక్కాలన్న స్వార్థంతో వారిని అంతమొందించాడు. రోకలి బండతో తలపై మోది ఇద్దరి ప్రాణాలు తీశాడు. సీఏ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఇవాళ గుంటూరు వెళ్లే ఆనందంలో ఉండగా ఆమె అనంతలోకాలకు వెళ్లింది.

అంజమ్మ వేకువజామున ఇంటి ముందు కల్లాపి చల్లి ఇంట్లోకి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన హరీశ్​ రోకలి బండతో ఆమె తలపై మోదాడు. కింద పడిపోయిన ఆమెను వదిలేసి ఇంట్లో నిద్రిస్తున్న సోదరి మౌనిక తలపై మోదడం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతిచెందిన మౌనికను హరీశ్​ తల్లి ఇంటి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి వదిలేసి వెళ్లింది. తల్లీకొడుకు కలిసి హత్యకు పథకం వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలను సేకరించారు.

ఆస్తి తగాదాలే కారణం..!

తాళ్ల ఖమ్మంపహాడ్​కు చెందిన కప్పల నాగయ్యకు పిల్లలు పుట్టకపోవడం వల్ల మొదటి భార్య చెల్లెలైన అంజమ్మను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొద్దిరోజులకే మొదటి భార్యకు కుమారుడు, రెండో భార్యకు కూతురు జన్మించారు. ఇలా సంసారం సాగిపోతున్న ఈక్రమంలో కుటుంబ కారణాలతో కప్పల నాగయ్య గత 13 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం తర్వాత ఆస్తి పంపకాల్లో తగాదాలు జరుగుతున్నాయి. మొదటి భార్యకు కూతురు, కుమారుడు, రెండో భార్య అంజమ్మ(హతురాలు)కు ఓ కూతురు ఉంది. ఇటీవలికాలంలో పెద్దల సమక్షంలో ఆస్తి పంపకాలు జరిగాయి. చెల్లింపుల విషయంలో మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఇదే హత్యలకు దారితీసిందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..

ABOUT THE AUTHOR

...view details