ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ - suryapeta army officer killed news

suryapet-army-officer-killed-in-skirmish-with-chinese-army-in-ladakh
భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్

By

Published : Jun 16, 2020, 5:11 PM IST

Updated : Jun 16, 2020, 10:03 PM IST

17:10 June 16

భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్

సంతోష్ తల్లిదండ్రులు

భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణలో సూర్యాపేట జిల్లా వాసి మృతి చెందారు. సైన్యంలో కల్నల్‌ ర్యాంక్‌ అధికారిగా ఉన్న సంతోష్ ప్రాణాలు విడిచారు. నిన్న రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య గాల్వన్ లోయ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఆయన మరణ వార్తను ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు చేరవేశారు.

నాలుగేళ్లుగా సైన్యంలో విధులు...

సూర్యపేట జిల్లాకు చెందిన బిక్కుమల్ల సంతోష్ పదిహేనుళ్లకు పైగా సైన్యంలో పనిచేస్తున్నారు. ఏదాదిన్నర కాలంగా చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌ బెటాలియన్‌కు రావాల్సి ఉన్నా... గాల్వన్‌కు రావాల్సిన బెటాలియన్‌ ఆలస్యం వల్ల అక్కడే విధుల్లో ఉండాల్సి వచ్చింది. సంతోష్‌కు కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. 

సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సంతోష్‌ మరణవార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఏం జరిగింది..?

లద్ధాఖ్​లోని గాల్వన్​ లోయ వద్ద​ భారత్‌-చైనా సైనికులు మరోసారి భౌతిక ఘర్షణకు దిగారు. సోమవారం రాత్రి ఇరు వర్గాలు పోట్లాడుకోవటం వల్ల హింసాత్మక పరిస్థితులకు దారి తీసింది.

 

ఇదీ చదవండి:

భారత్​, చైనా సైనికుల ఘర్షణ- ముగ్గురు జవాన్ల మృతి


 

Last Updated : Jun 16, 2020, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details