ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధాని అమరావతి, విశాఖ ఉక్కు కోసం దిల్లీ స్థాయిలో పోరాటం'

రాజధాని అమరావతి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని... రైతులు, మహిళలు మండిపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దంటూ... దిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని మహిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు.

'రాజధాని అమరావతి, విశాఖ ఉక్కు కోసం దిల్లీస్థాయిలో పోరాటం'
'రాజధాని అమరావతి, విశాఖ ఉక్కు కోసం దిల్లీస్థాయిలో పోరాటం'

By

Published : Feb 25, 2021, 4:42 PM IST

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దంటూ... దిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని మహిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న నిరహారదీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. గత 436 రోజులుగా అమరావతి రైతులు నిరసనలు చేస్తున్నా... ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవటం దారుణమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా దిల్లీ వెళ్లారా..? అని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజు నుంచే రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీలో పోరాటం చేస్తామన్నారు.

రాజధాని అమరావతి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ రైతులు, మహిళలు మండిపడ్డారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details