వృత్తి విద్యా కోర్సుల ఫీజుల చెల్లింపుపై స్పష్టతనిస్తూ...హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 2018-19 విద్యా సంవత్సరానికి నిర్ణయించిన రుసుములను విద్యార్థులు చెల్లించాలని తెలిపింది. 2019-20కి ఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన రుసుములో గతంలో చెల్లించిన సొమ్మును మినహాయించగా...మిగిలినదానిలో సగం మెుత్తానికి...విద్యార్థులు బ్యాంకు పూచీకత్తును ఆయా కళాశాలలకు ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన రుసుములను ప్రకటించే వరకు ఈ విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. ఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన రుసుములను ఆయా కళాశాలల యాజమాన్యాలకు తెలియజేయాలని సర్కారును ఆదేశించింది. సర్కారు దాఖలు చేసిన అప్పీల్లో భాగంగా...ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది .
గతేడాది ఫీజును విద్యార్థులే చెల్లించాలి: హైకోర్టు - ఏఎఫ్ఆర్సీ
వృత్తి విద్యా కోర్సుల ఫీజుల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2018-19 విద్యా సంవత్సరానికి నిర్ణయించిన ఫీజును విద్యార్థులే చెల్లించాలని పేర్కొంది.
గతేడాది ఫీజును విద్యార్థులే చెల్లించాలి: హైకోర్టు