ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Student Suicide: ప్రేమ విఫలమై యువతిపై హత్యాయత్నం చేసిన యువకుడు ఆత్మహత్య - ఆత్మహత్య చేసుకున్న జీడిమెట్ల విద్యార్థి

TS News: ప్రేమ విఫలమై యువతిపై హత్యాయత్నం చేసిన కేసులో.. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. ఉరేసుకుని మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

student-suicide-in-jeedimetla-medchal-district
ప్రేమ విఫలమై యువతిపై హత్యాయత్నం చేసిన యువకుడు ఆత్మహత్య

By

Published : Dec 1, 2021, 9:24 AM IST

love failure person suicide: ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో జరిగింది. అపురూప కాలనీలో నివాసముంటున్న శ్యామ్ సింగ్ కుమారుడు ప్రేమ్ సింగ్ (22) కూకట్​పల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమ్ సింగ్ గచ్చిబౌలి వట్టినాగులపల్లికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. వారి మధ్య గొడవలు జరగడంతో అక్టోబర్ 27న మద్యం మత్తులో యువతి ఇంటికి కత్తితో వెళ్లి ఆమెపై హత్యాయత్నం చేశాడు. యువతి మెడ, చేతులపై గాయాలు చేశాడు. యువతి ప్రతిఘటించి కేకలు వేయడంతో తల్లిదండ్రులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. యువతిని, తల్లిదండ్రుల దాడిలో గాయపడిన యువకుడు ప్రేమ్ సింగ్​ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అక్కడి నుంచి యువకుడు పరారయ్యాడు.

యువకుడు, యువతి బంధువుగా పోలీసులు నిర్ధారించారు. అనంతరం యువకుడు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈనెల 27న రాత్రి చదువుకుంటానని తన గదిలోకి వెళ్లిన యువకుడు ఎంతకీ బయటకు రాకపోవడంతో 29న కుటుంబసభ్యులు గమనించగా.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ప్రేమ్ సింగ్​ను చికిత్స తీసుకున్న అనంతరం అరెస్టు చేయకపోవడంతో తప్పించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో గచ్చిబౌలి పోలీసులు నిర్లక్ష్యం వహించినట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనం:

ABOUT THE AUTHOR

...view details