ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Statue of Equality Inauguration Celebrations : వైభవంగా రెండోరోజు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు - statue of equality inauguration in muchintal

Statue of Equality Inauguration Celebrations : భక్తులు, వేద పండితుల శ్రీమన్నారాయణ నామస్మరణతో మొదలైన శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండో రోజు జరుగుతున్న ఈ ఉత్సవాలకు తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

Statue of Equality Inauguration Celebrations
Statue of Equality Inauguration Celebrations

By

Published : Feb 3, 2022, 11:46 AM IST

Statue of Equality Inauguration Celebrations: సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు శోభాయమానంగా జరిగింది. రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి.

కాసేపట్లో శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో భాగంగా శమి, రావి కర్రలతో అగ్ని మథనం చేయనున్నారు. అగ్నిహోత్రంతో 1035 కుండలాల్లో హోమం చేయనున్న రుత్వికులు.. ఇందుకోసం యజ్ఞ కుండలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులతో 1035 కుండలాల్లో హోమాలు నిర్వహించనున్నారు. ప్రవచన శాలలో వేద పండితులచే ప్రవచన పారాయణం ఉంటుంది.

Statue of Equality : శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. కరోనా నిబంధనలు అమలవుతున్నాయో లేదో చూశారు.

సంబంధిత కథనాలు :

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details