ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FAPTO PROTEST: 'సీపీఎస్ రద్దు సహా ఉద్యోగ సమస్యలు పరిష్కరించండి' - Teachers' protests across the state

సీపీఎస్ రద్దు సహా ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు.

fapto Statewide protest
ఎఫ్ఏపీటీవో ఆధ్వర్యంలో రాష్ట్రవ్వాప్తంగా ధర్నాలు

By

Published : Jul 23, 2021, 7:37 PM IST

సీపీఎస్ రద్దు సహా ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(FAPTO) ఆధ్వర్యంలో ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేరవేర్చకపోగా.. తమకు రావాల్సిన హక్కులను సైతం వైకాపా ప్రభుత్వం కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లాలో...

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఫ్యాప్టో(Federation of Andhra Pradesh Teachers' Association) ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు శంకర్ విలాస్ కూడలి నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ఎమ్మార్వో కలసి వినతి పత్రం అందజేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్సీ , డీఏలు అమలు చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్​ సుధీర్ బాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్​.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఆములు చేయాలని ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు బసవ లింగారావు డిమాండ్ చేశారు. విద్యా శాఖలో ప్రతినెల పదోన్నతులు కల్పించాలని.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

కడప జిల్లాలో...
అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన సీఎం జగన్​.. రెండేళ్ల పూర్తైనటప్పటికీ ఆ ఊసే లేదని ఎఫ్​ఏపీటీవో రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 8 వందల మంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారని.. వారికి ఇప్పటికీ ఎలాంటి పరిహారం ఇవ్వలేదన్నారు. పెండింగ్​లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఎస్​ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాయచోటి రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను బలహీన పరిచేందుకు ప్రాథమిక పాఠశాలల విలీన కార్యక్రమాన్ని చేపట్టడం దారుణమని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొన్నారు. అనంతరం తహసిల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

తమ సమస్యలు పరిష్కరించాలని కోరతూ.. జమ్మలమడుగు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. విద్యా శాఖలో ఉన్న ఖాళీల పోస్టులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. కొవిడ్ ద్వారా చనిపోయిన ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లాలో..
నందిగామ ఎమ్మర్వో ఆఫీస్ ఎదుట ఉద్యోగులు బైఠాయించారు. కనీసం నెలవారీ జీతం వస్తుందా లేదా అన్న భయంతోనే ఉపాధ్యాయులు కాలం వెల్ల తీస్తున్నారని జిల్లా ఉపాధ్యాయ సంఘ నాయకుడు బత్తిన అరుణ కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద FAPTO ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ధర్నా చేపట్టారు. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జగ్గయ్యపేట తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు తన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు. ధర్నాలో ఎస్​టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్,హెచ్​ఎం అసోసియేషన్​ పాల్గొన్నారు.

మొవ్వ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఉపాధ్యాయులు.. పెండింగ్​లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్​కు వినతి పత్రం సమర్పించారు.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తే... భవిష్యత్త్​లో తాడేపల్లి ముట్టడిస్తామని సంఘాల నాయకులు పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో..

మడకశిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ.. ఎమ్మార్వో ఆనంద్ కుమార్​కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఏ ఉద్యోగి సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించడంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఉపాధ్యాయ నాయకులు హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా...

కనిగిరి రెవెన్యూ కార్యాలయం దగ్గర ఎఫ్​ఏపీటీవో ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేశారు. ఉద్యోగుల సమస్యలపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్​ స్పందించి వెంటనే స్పందించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎఫ్​ఏపీటీవో(FAPTO) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల జిల్లా కార్యదర్శి జానీ డిమాండ్ చేశారు. రెెండేళ్లుగా డీఏలు చెల్లించలేదని.. అదేవిధంగా పీఆర్​సీని నేటికి ప్రకటించలేదని పేర్కొన్నారు.


శ్రీకాకుళం జిల్లాలో..

టెక్కలిలోని అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేసిన ఉద్యోగులు... బకాయి పడిన డీఏలను తక్షణమే చెల్లించాలన్నారు. నరసన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ఆవరణంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాల్లో..

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తణుకులో ఉద్యోగ సంఘాల నాయకలు ధర్నా చేశారు. పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలో ..

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు కె ఆదిరెడ్డి, శ్రీమణి ఆరోపించారు. సమస్యల పరిష్కారానికై యూటూఎఫ్ ఆధ్వర్యంలో రంపచోడవరం ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తామన్నారు. ధర్నాలో జిల్లా నాయకులు, తదితరలు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలో...
తన సమస్యలు పరిష్కరించాలని ఆంద్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఎఫ్ఏపీటీఓ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండి...

Somireddy: కృష్ణాబోర్డు, ఎన్టీటీకి సంబంధం లేకుండా రాయలసీమ లిప్టు ఎలా నిర్మిస్తారు..?

ABOUT THE AUTHOR

...view details