రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తోన్న జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చేందుకు నిర్దేశించిన వైఎస్ ఆర్ లా నేస్తం పథకం పెండింగ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అర్హత కల్గిన జూనియర్ న్యాయవాదులకు నెల నెలా చెల్లించాల్సిన స్టైఫండ్ నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ న్యాయవాదులకు ఒక్కొక్కరికి నెలకు 5 వేల చొప్పున స్టైఫండ్ అందిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి స్టైఫండ్ ను ప్రభుత్వం నిలిపి వేసింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి స్టైఫండ్ విడుదల చేశారు.
జూ.న్యాయవాదులకు తీపి కబురు.. 'వైఎస్ఆర్ లా నేస్తం' నిధులు విడుదల - ys jagan
‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకం చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
state-government