ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ - సీఎం కేసీఆర్​

ప్రస్తుతం రాష్ట్ర రాబడులు తగ్గిన నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్​ రూ.1.70 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ కంటే ఈసారి 8 నుంచి 10 శాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

today telangana state complete budget onwards

By

Published : Sep 9, 2019, 6:12 AM IST

ఈసారి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం 1.67 లక్షల కోట్ల నుంచి 1.70 లక్షల కోట్ల మధ్య ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర రాబడులు అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో బడ్జెట్​ పరిమాణం ఓట్​ ఆన్​ అకౌంట్​ కంటే 8 నుంచి 10 శాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఓట్​ ఆన్​ బడ్జెట్​ను రూ.1.82 లక్షల కోట్లతో ఆమోదించారు. అయితే మాంద్య పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించిన తెలంగాణ సీఎం కేసీఆర్​ దానికి అనుగుణంగా ప్రస్తుత పద్దుకు తుదిరూపు ఇచ్చారు.

వ్యవ'సాయ' రంగాలకు ప్రాధాన్యం

నేడు తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్

వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు ఈసారి కూడా తెలంగాణ పద్దులో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్థిక పరిస్థితుల్లో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ వీటికి కేటాయింపులు తగ్గించకుండా మందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెరాస ఎన్నికల హామీలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు బడ్జెట్​లో పెద్దపీట వేయనున్నారు.

ఇదీ చూడండి : కేసీఆర్​ కేబినెట్​లో 18కి చేరిన మంత్రుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details