ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2022, 7:14 AM IST

ETV Bharat / city

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం.. రద్దు కానున్న కళాశాల విద్యాశాఖ కమిషనరేట్‌

UNIVERSITY: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలోని 162 డిగ్రీ కళాశాలలను ఈ వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తారు. ప్రభుత్వ కళాశాలలన్నీ విశ్వవిద్యాలయ కళాశాలలుగా మారిపోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు పంపింది.

special university for government degree colleges
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం

UNIVERSITY: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలోని 162 డిగ్రీ కళాశాలలను ఈ వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తారు. ప్రభుత్వ కళాశాలలన్నీ విశ్వవిద్యాలయ కళాశాలలుగా మారిపోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు పంపింది. వర్సిటీ ఏర్పాటు ఎలా చేయాలి? పరిపాలన, పర్యవేక్షణకు అవలంబించాల్సిన విధానాలను ఇందులో పేర్కొన్నారు.

ప్రస్తుతం డిగ్రీ కళాశాలలన్నీ కళాశాల విద్యాశాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి ఉండగా.. మూడు ప్రాంతీయ సంయుక్త సంచాలకుల (ఆర్జేడీ) కార్యాలయాలున్నాయి. ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేస్తే విద్యాశాఖ కమిషనరేట్‌ రద్దవుతుంది. వర్సిటీ నుంచే నేరుగా పర్యవేక్షణ జరుగుతుంది. డిగ్రీ కళాశాలల వర్సిటీ రాష్ట్రం మొత్తానికి ఒక్కటే ఉంటుంది.

పరిపాలన ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు రాజమహేంద్రవరం, గుంటూరు, కడప జిల్లాల్లో మూడు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధ్యాపకుల సర్వీసు నిబంధనలు, ఇతరత్రా అంశాలను వీటి నుంచే పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్న అధ్యాపకులను అక్కడి నుంచే వర్సిటీలోకి మార్పు చేస్తారు.

  • ప్రస్తుతం జోనల్‌ విధానంలో అధ్యాపకులను నియమిస్తున్నారు. వర్సిటీ ఏర్పాటైతే అందులో మార్పులు జరిగే అవకాశముంది. దీనిపై అధ్యాపకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వర్సిటీ ఏర్పాటు చేసి, రాష్ట్ర స్థాయి పోస్టులుగా మారిస్తే బదిలీల్లో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.
  • ఏకంగా 3,500 మంది అధ్యాపకులు, 4,000 మంది బోధనేతర సిబ్బంది సర్వీసు అంశాలను ఒకే వర్సిటీ ఎలా పర్యవేక్షిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
  • నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి విద్యా సంస్థ భవిష్యత్తులో డిగ్రీ పట్టాలు ఇచ్చే స్వయంప్రతిపత్తి సంస్థగా మార్పు చెందాలి. దీనికి విరుద్ధంగా డిగ్రీ కళాశాలలు అన్నింటినీ ఒకే వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తున్నారు.
  • ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఆయా జిల్లాల్లోని వర్సిటీలకు అనుబంధంగా ఉంటాయి. ప్రభుత్వ కళాశాలలు ఒకే వర్సిటీ పరిధిలోకి వస్తాయి. అంటే డిగ్రీలకు పట్టాలు ఇవ్వడంలో రెండు రకాల విధానాలు అమలవుతాయి.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details