తెలంగాణలో కరోనా కేసులకు హాట్‌స్పాట్‌గా మారింది రాజధాని హైదరాబాద్. కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచటం వల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అదొక్కటే కారణంగా కనిపించటం లేదు. ఈ రోజుకీ సామాజిక వ్యాప్తి జరగలేదని ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెబుతున్నా... ప్రజలు మాత్రం ఎప్పుడో వ్యాప్తి జరిగిందని బలంగా విశ్వసిస్తున్నారు. తమకు వ్యాధి ఎక్కడ సోకింది అనేది గుర్తించలేని స్థితికి హైదరాబాద్ వెళ్లిపోయిందని వారు అంటున్నారు.
హైదరాబాద్‌లో కేసుల వివరాలు ఇలా మే 31 నాటికి 2,698 ప్రస్తుతం 29,536 జీహెచ్ఎంసీ పరిధిలో 23,223 జూన్‌లో 13,741(సగటున రోజుకు 454 ) జులై తొలి వారంలో 9,227 (రాష్ట్రంలో) జులై 1-8 13,197 (రాష్ట్రంలో) జులైలో సగటున రోజుకు 1650 బుధవారం నాటికి 11,939(యాక్టివ్ కేసులు) కోలుకున్నవారు 17,279 ఇప్పటిదాకా నిర్వహించిన టెస్టులు 1,34,801
కోర్టు మొట్టికాయలు
తెలంగాణ సర్కారుపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా నివేదికలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిలో వివరణాత్మక సమాచారం ఎందుకు లేదని ప్రశ్నించింది. టెస్టుల నిర్వహణపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది.