ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కల్నల్ సంతోష్ వీర మరణం: ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాలు - Martyred Indian soldier Santosh Babu

తండ్రి కోరికను నెరవేర్చాలి.. దేశసేవలో తరించాలి.. అందుకోసం చిన్ననాటి నుంచే కఠోర శ్రమ.. నిరంతర సాధన.. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరంగా ఉండడానికి సిద్ధపడి సైనిక్‌స్కూల్లో చేరారు.. పట్టుదలతో కృషి చేసి సైన్యంలోకి ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎదిగి పిన్నవయసులోనే కర్నల్‌ స్థాయికి చేరారు.. చివరకు దేశమాత కోసం ప్రాణాలర్పించారు సంతోష్​ బాబు. వీరోచిత పోరాటంలో ప్రాణాలర్పించిన సంతోష్ ఉదంతంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాలు..

Colonel Santosh Babu
Colonel Santosh Babu

By

Published : Jun 17, 2020, 3:52 PM IST

Updated : Jun 17, 2020, 4:42 PM IST

బిక్కమల్ల సంతోష్ వీర మరణం...

భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట జిల్లా వాసి మృతి చెందారు. సైన్యంలో కర్నల్‌ ర్యాంక్‌ అధికారిగా ఉన్న సంతోష్ ప్రాణాలు విడిచారు. సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య గాల్వన్ లోయ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది.

ఇదే ప్రథమం...

భారత్‌ - చైనా సరిహద్దులో కర్నల్‌ సంతోష్‌బాబు మృతి చెందడం మాజీ సైనికాధికారుల్లో చర్చనీయాంశమైంది. అనేకమంది తెలుగు సైనికాధికారులు దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నా కల్నల్‌స్థాయి అధికారి చనిపోవడం మాత్రం ఇదే ప్రథమం. లింక్ క్లిక్ చేయండి...

వీరగాథ

అంచెలంచెలుగా ఎదిగి 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు బిక్కమల్ల సంతోష్. కొన్నాళ్లు కాంగోలో మన దేశం తరఫున విధులు నిర్వర్తించిన సంతోష్‌ 37 ఏళ్ల వయసులోనే కర్నల్‌ హోదా పొందారు. ఆయన చివరిసారిగా గతేడాది మార్చిలో సూర్యాపేటకు వచ్చారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

ఆ పోరులో.. ఈ ఊరిలో ఎగిరింది నీ బావుటా...

దేశ ప్రజల ‘సంతోష’మే తన సంతోషం అనుకున్నారు కర్నల్‌ సంతోష్‌బాబు. తండ్రి ఆశయ సాధనకు, తన లక్ష్యంపై గురిపెట్టి చిన్నప్పటి నుంచే ఆ దిశగా అడుగులు వేశారు. నాయకుడిగా ఎదిగారు. దేశసేవకు పునీతుడిని చేసిన ఆ తల్లిదండ్రులకు ఆయన మరణవార్త ‘సంతోషం లేకుండా చేసింది.

సైనికుడా వందనం...

ఒళ్లంతా నెత్తురోడుతున్నా... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా... పెదవులపై చిరునవ్వు... కళ్లలో గర్వం.. గుండెళ్లో ధైర్యంతో... నిను చేరాలని ఎదురు చూస్తున్నా... ఈ పరిస్థితిలో కూడా ఇంత సంతోషంగా ఎందుకున్నానో తెలుసుకుంటేనైనా నా నుంచి దూరంగా పారిపోతున్న నువ్వు దరికి చేరుతావని ఆశిస్తున్నా.. ఇంతకీ నా కథ ఏమిటంటే... లింక్ క్లిక్ చేయండి...

చివరి చూపులు

చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు (39) అమరుడవడంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వస్థలం సూర్యాపేటలో అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో చేపట్టనున్నారు. లింక్ క్లిక్ చేయండి...

Last Updated : Jun 17, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details