ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పార్టీలు మారేటప్పుడు నైతిక విలువలు పాటించాలి' - tammineni seetharam

స్పీకర్ వ్యవస్థకు సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని సభాపతి తమ్మినేని సీతాారాం అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ నేతృత్వంలో రాష్ట్రాల స్పీకర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తమ్మినేని సీతారాం హాజరయ్యారు. దేశవ్యాప్తంగా స్పీకర్ వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై చర్చించారు.

సభాపతి తమ్మినేని సీతాారాం

By

Published : Aug 28, 2019, 9:28 PM IST

నేతలు పార్టీలు మారేటప్పుడు నైతిక విలువలు పాటించాలని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పార్టీకి, పదవికి రాజీనామా చేశాకే...వేరే పార్టీలోకి వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఉగాండా సదస్సులో చర్చించేందుకు 10 అంశాలను ఎంపిక చేశారన్న తమ్మినేని... ఫిరాయింపుల చట్టంపై లోక్‌సభ స్పీకర్ కమిటీ వేయనున్నారని తెలిపారు. స్పీకర్ పరిధిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. శాసనసభను కాదని కొందరు న్యాయస్థానాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు.

మనం చేసిన చట్టాలే కోర్టుకు వెళ్లడం... అవి నిర్దేశించే పరిస్థితి రావడం మంచిదికాదని తమ్మినేని సీతారాం తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వాల ఒప్పందాలు నెరవేరనప్పుడు సమస్యలు వస్తున్నాయన్నారు. అలాంటి సమయాల్లో ప్రజాతీర్పు అపహాస్యం అవుతుందని చెప్పారు. రాజధాని మారుస్తామని ఎవరు చెప్పారు..? సీఎం చెప్పారా..? అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను మంత్రి ఉటంకించారంతేనని స్పష్టం చేశారు.

సభాపతి తమ్మినేని సీతాారాం

ఇదీ చదవండీ...అన్యాయాన్ని ప్రశ్నిస్తే... అక్రమ కేసులా..?

ABOUT THE AUTHOR

...view details