Asani Cyclone effect on Trains: అసని తుపాన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. తుపాన్ వల్ల 37 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. షెడ్యూల్ మార్పులకు అనుగుణంగా తమ ప్రయాణాలను సిద్ధం చేసుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులకు సూచించింది
'అసని' ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే - scr secunderabad
Asani Cyclone effect on Trains: అసని తుపాను ప్రభావంతో 37 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను రీ-షెడ్యూల్ చేశామని తెలిపింది. మార్పులకు అనుగుణంగా ప్రయాణికులు తమ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రైల్వే శాఖ వెల్లడించింది.
37 రైళ్లు రద్దు
విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ, భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-భీమవరం జంక్షన్ ప్రాంతాలకు నడపాల్సిన రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఇవీ చూడండి:బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను 'అసని'... కాసేపట్లో భూభాగం పైకి..