రాయలసీమ ప్రజలకు భాజపా నేత సోము వీర్రాజు క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసే క్రమంలో... రాయలసీమ ప్రజల మనసులు గాయపడ్డాయన్నారు. రాయలసీమ రతనాలసీమ అని.. ఈ పదం తన హృదయంలో పదిలంగా ఉంటుందన్నారు. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని.. అదే భాజపా ఆలోచన అని సోము వీర్రాజు ఆకాంక్షించారు.
రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోమువీర్రాజు - రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోమువీర్రాజు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కడప జిల్లాకు సంబంధించి తాను వాడిన పదాలు సీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అభివృద్ధి విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ అలా అన్నానని చెప్పారు.
రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోమువీర్రాజు
Last Updated : Jan 29, 2022, 10:31 AM IST