సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం మళ్లీ కోలుకోలేనతంగా అప్పుల ఊబిలోకి వెళ్లిందన్నారు. వైకాపా సర్కారు.. రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తోందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సుదీర్ఘ తీరప్రాంతం, ఆర్థికవనరులు ఉన్నా.. అప్పులు పెరిగాయని సోము వీర్రాజు పేర్కొన్నారు.
'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి..' - somu veeraju comments on cm jagan
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు.
somu veeraju letter to cm jagan on financial condition of ap