ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మంత్రి కొడాలి నాని ఇష్టారీతిన మాట్లాడటం సరికాదు'

మంత్రి కొడాలి నాని ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. దేవాలయాలపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను సోము వీర్రాజు తప్పు బట్టారు. కొడాలి నాని వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

somu veeraju fires on kodali nani
సోము వీర్రాజు

By

Published : Sep 21, 2020, 1:03 PM IST

దేవాలయాలపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. నాయకులు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని.. మాట్లాడే భాష ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. ఏ సీఎం అయినా తమ సభ్యులు సరిగా మాట్లాడేలా చూడాలని.. నాయకులు వినియోగించే భాష పట్ల చట్టబద్ధత ఉండాలని హితవు పలికారు. దేవుళ్ల పట్ల ఇష్టారీతిన మాట్లాడటాన్ని భాజపా హర్షించదని సోము వీర్రాజు అన్నారు. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి నాని అన్నారు. మంత్రి కొడాలి నాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇష్టారీతిన మాట్లాడకుండా భవిష్యత్తులో భాజపా పాలసీ చేయబోతోంది సోము వీర్రాజు తెలిపారు.

మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆలయాలకు భాజపా నేతలు వెళ్తారని సోము వీర్రాజు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆంజనేయస్వామికి వినతిపత్రం ఇస్తామన్నారు. ఆ తర్వాత మంత్రి కొడాలి నానిపై మండలస్థాయి పీఎస్‌లలో ఫిర్యాదు చేయనున్నాట్లు సోము వీర్రాజు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేయాలని కోరుతున్నామని సోము వీర్రాజు అన్నారు. రైతును రాజును చేసేందుకే కేంద్రం వ్యవసాయ బిల్లులు తెచ్చిందని సోము వీర్రాజు పేర్కొన్నారు. రైతును పారిశ్రామికవేత్తను చేయాలనేదే కేంద్రం ఆలోచన అని వెల్లడించారు. పంటకు విస్తృత మార్కెట్ లభించే అవకాశం బిల్లులతో వచ్చిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details