ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా కొడుకు శవాన్నైనా చూపించండి.. జవాన్ తల్లిదండ్రుల వేడుకోలు - కాగజ్​నగర్ వార్తలు

దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ.. ప్రమాదవశాత్తు మరణించిన తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలని ఆ జవాన్ తల్లిదండ్రులు కోరుతున్నారు. మాతృభూమి మీద ప్రేమతో కుటుంబానికి దూరంగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించి... ప్రాణాలు కోల్పోయిన తమ కుమారుడిని కడసారి చూసేందుకైనా మృతదేహాన్ని తమకు అప్పగించాలని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

soldier-shakir-hussain
soldier-shakir-hussain

By

Published : Oct 18, 2020, 9:01 PM IST

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణానికి చెందిన జవాన్ షాకిర్ హుస్సేన్ సరిహద్దు ప్రాంతమైన లద్ధాఖ్​లో విధుల నిర్వహిస్తూ... ప్రమాదవశాత్తు మరణించాడు. విధులు ముంగించుకొని తిరిగి బేస్​ క్యాంపునకు వస్తుండగా... కొండ చరియలు విరిగి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షాకిర్ చనిపోయినట్లు కుటుంబసభ్యులకు ఆర్మీ అధికారులు తెలిపారు.

మృతదేహాన్ని అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా వారు వెల్లడించారు. పోస్ట్​మార్టం నిర్వహించగా... కరోనా పాజిటివ్ వచ్చిందని... మృతదేహం అప్పగించలేమని ఆర్మీ అధికారులు తెలిపినట్లు... షాకిర్ తండ్రి షేక్ హుస్సేన్ తెలిపాడు. కనీసం తమ కుమారుడి మృతదేహం ఫోటో అయిన పంపలేదని వాపోయారు.

మా కొడుకు శవాన్నైనా చూపించండి.. జవాన్ తల్లిదండ్రుల వేడుకోలు

దేశ రక్షణలో ఏ జవాన్ చనిపోయినా అధికారులు పరామర్శించేందుకు వస్తారని... కానీ తమ వద్దకు ఎవరు రాలేదని తెలిపారు. తమ కుమారుడు ఏమైనా దేశ ద్రోహా అంటూ ప్రశ్నించారు. కొవిడ్​ పాజిటివ్ వస్తే దాని నియమాల మేరకే అంత్యక్రియలు నిర్వహించాలని... కానీ తమకు కడసారి చూపుకుడా లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కేంద్రమంత్రి రాజ్​నాథ్ సింగ్ చొరవ తీసుకుని తమ కుమారుడి మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరారు.

ఇదీ చూడండి:

లద్ధాఖ్​లో కొండ చరియలు విరిగిపడి జవాన్ మృతి

ABOUT THE AUTHOR

...view details