ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'15 - 20 రోజుల్లో ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందిస్తాం' - '15-20 రోజుల్లో ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందిస్తాం'

15 - 20 రోజుల్లో ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందిస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ తెలిపారు. ఎవరూ బయట మార్కెట్‌లో కొనుక్కోవద్దని సూచించారు. విద్యార్థుల సంఖ్య పెరిగినందున పుస్తకాలు ఇవ్వలేకపోయామని అన్నారు.

Shortage of books
Shortage of books

By

Published : Mar 8, 2021, 10:08 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తమ అంచనాల కంటే అధికంగా పెరగడంతో అందరికీ పాఠ్యపుస్తకాలను ఇవ్వలేకపోయామని, 15 - 20 రోజుల్లో ప్రతి విద్యార్థికి అందిస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ వెల్లడించారు. విద్యార్థులు బయట మార్కెట్‌లో కొనుక్కోవద్దని, ఉచితంగానే పుస్తకాలను ఇస్తామని స్పష్టం చేశారు. ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ‘సార్‌.. పుస్తకాలెక్కడ?’ శీర్షికతో ఆదివారం ప్రచురితమైన కథనంపై స్పందించిన ఆయన విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రైవేటు పాఠశాలల నుంచి ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రభుత్వ బడులకు తరలివచ్చారు. ప్రవేశాలు అంచనాలను మించిపోవడంతో కొత్తగా చేరిన వారికి అదనంగా పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 -15లో విద్యార్థుల సంఖ్య 41.83 లక్షలుండగా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2019-20లో 38.97లక్షలకు చేరింది. ఈ ఏడాది ఇది ఒక్కసారిగా 45.03 లక్షలకు పెరిగింది’ అని వెల్లడించారు.

ఏటా డీఎస్సీ

‘డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులపై సాధారణ పరిపాలన, ఆర్థికశాఖతో చర్చిస్తున్నాం. టెట్‌, ఉపాధ్యాయ నియామక పరీక్ష కలిపి నిర్వహించాలా? విడివిడిగా నిర్వహించాలా అనే దానిపై ఆలోచిస్తున్నాం. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

2023లో సీబీఎస్‌ఈ పరీక్షలు

రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈ విధానం అమలుపై ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. 8-10 తరగతులకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు అవసరమవుతుంది. అనుమతికి ఏడాది సమయం పడుతుంది. 2022-23 నాటికి మొదటి బ్యాచ్‌ విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. సీబీఎస్‌ఈ అమలు చేసినా తెలుగు భాష, సంస్కృతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

ఇదీ చదవండి:యుద్ధ రంగంలో శివంగిలా.. యువతకు ఆదర్శంగా

ABOUT THE AUTHOR

...view details