SHIVARATRI CELEBRATIONS: రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి శోభ సంతరించుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గాంధర్వ రాత్రి పురస్కరించుకుని.... దివ్య కైలాసాన్ని తలపై ఎత్తుకొని శివ తాత్పరతను చాటుకున్న దశకంఠపై సోమస్కంధమూర్తి కొలువుదీరారు. సౌందర్యానికి ప్రతీకైన మయూరిపై శ్రీ జ్ఞానప్రసూనాంభదేవి కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున ఈవో భ్రవరాంబ... శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు.
కడప జిల్లా రాయచోటిలో వెలిసిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో... బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. రాత్రి భద్రకాళి అమ్మవారి సుమంగళి పూజ ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
కర్నూలు జిల్లా మహనందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సావాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలో ఉన్న ధ్వజస్తంభాన్ని ప్రత్యేకంగా అలంకరించి వేద పండితులు భేరీ పూజ నిర్వహించారు. నందీశ్వరుడు ఉన్న ధ్వజ పటాన్ని ధ్వజ స్తంభంపై ఎక్కించే కార్యక్రమం నిర్వహించారు.