ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యాడ దాగున్నావో చిరుత?

రంగారెడ్డి జిల్లా కాటేదాన్​లో కలకలం రేపిన చిరుత ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. మేకను ఎరగా వేసి చిరుతను పట్టుకునే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒకవేళ బోన్​లో పడకుండా తప్పించుకుంటే ఎటువైపు వెళ్లే అవకాశముందో తెలుసుకోవడానికి వీలుగా కెమెరా ట్రాప్​లతో పాటు.. డ్రోన్ కెమెరాలతోనూ పర్యవేక్షిస్తున్నారు.

By

Published : May 15, 2020, 9:47 AM IST

searching for cheetah
చిరుత కోసం గాలిస్తున్న అధికారులు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో కలకలం రేపిన చిరుత ఆచూకీ కోసం అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 40 ఎకరాల ఓ వ్యవసాయ క్షేత్రంలో నక్కిన చిరుత కోసం అటవీ, పోలీసుశాఖ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. చిరుత కోసం 4 ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. బంధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

బోన్లు ఏర్పాటు

వ్యవసాయ పొలం పక్కనే జనావాసాలు ఉన్నందున... ఒకవేళ ఇళ్లల్లోకి వెళితే మనుషులపై దాడి చేసే ప్రమాదముందని భావిస్తున్నారు. పొదల్లో నక్కిన చిరుత... ఆహారం, నీళ్ల కోసం బయటికి రావొచ్చనే అంచనాతో బంధించేందుకు 2 బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా వేశారు. వలలు కూడా ఏర్పాటు చేశారు.

23 కెమెరా ట్రాప్​లతో గాలింపు

మహేశ్వరంలోని అటవీ ప్రాంతం నుంచి.. లేదా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు ఉన్న అటవీక్షేత్రం నుంచి చిరుత వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వచ్చిన దారినే మళ్లీ వెళ్లే అవకాశం ఉన్నందున అటవీ అధికారులు పలుచోట్ల 23 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:తెలంగాణ: హైవేపై చిరుత కలకలం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details