సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో కేటాయించిన సున్నపు రాయి లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 613. 476 హెక్టార్ల పరిధిలో 50 ఏళ్లకు సున్నపు రాయి గనుల మైనింగ్ లీజును కేటాయిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2009లోనే అప్పటి ప్రభుత్వం సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు గనుల లీజులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మైన్స్ అండ్ మినరల్స్ సవరణ చట్టం సెక్షన్ 8 A(3) ప్రకారం లీజు గడువును మరో 50 ఏళ్ల పాటు పొడిగిస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు.