ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

sand stock: వరదలు రాకముందే ఇసుక నిల్వ చేయాలి: గోపాలకృష్ణ ద్వివేది - sand stock in AP

వర్షకాలం మొదలు అవుతున్నందున నదుల్లో వరదలు రాకమునుపే ఇబ్బందులు రాకుండా ఇసుక నిల్వ చేయాలని... గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ప్రతీ టన్ను ఇసుకనూ 475 రూపాయలకు మాత్రమే విక్రయించేలా చూడాలని స్పష్టం చేశారు.

ఇసుక నిల్వ
ఇసుక నిల్వ

By

Published : Jun 4, 2021, 8:07 PM IST

వర్షాకాల సీజన్ ఆరంభం అవుతున్నందునా.. నదుల్లో వరదలు రాకమునుపే ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేయాలని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ జేసీలు, గనులశాఖ అధికారులతో సమీక్షించిన ఆయన.. తక్షణం అన్ని రీచ్​లలోనూ తవ్వకాలను పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 384 ఇసుక రీచ్​లలో తవ్వకాలను జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్​కు అప్పగించామని.. ఆ సంస్థ కేవలం 136 చోట్ల మాత్రమే తవ్వకాలు చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు, సరఫరా, పంపిణీపై రోజువారీ నివేదికలు ఇవ్వాల్సిందిగా సూచించారు. అవసరమైన చోట్ల స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details