కరోనా నియంత్రణకై కృషి చేస్తున్న వైద్యులు కనీస వసతులు కల్పించాలని అడిగితే వారిపై రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. నర్సీపట్నంలో వైద్యులు కనీస వసతులు కల్పించాలని తమ ఆవేదనను వ్యక్తం చేస్తే.. ఆయనకు రాజకీయాలు అంటగట్టడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది మనస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రభుత్వం వైద్యులకు కావాల్సిన కనీస వసతులు, సౌకర్యాలు, రక్షణ పరికరాలు తక్షణమే ఏర్పాటు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. మంత్రులు క్షేత్రస్థాయిలో ఆసుపత్రులకు వెళ్లి వసతులను సందర్శించాలన్నారు. ప్రణాళిక ద్వారా వెళ్తేనే వైరస్ వ్యాప్తి కట్టడి చేయగలమని ప్రభుత్వానికి సూచించారు.
'తక్షణమే వైద్యులకు రక్షణ పరికరాలు ఏర్పాటు చేయాలి' - sailajanath on corona virus
ప్రభుత్వం వైద్యులకు కావాల్సిన కనీస వసతులు, సౌకర్యాలు, రక్షణ పరికరాలు తక్షణమే ఏర్పాటు చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. వసతులు కల్పించాలని వైద్యులు అడిగితే... రాజకీయాలు అంటగడతారా అని ప్రశ్నించారు.
న