సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు.. రేపు క్రస్ట్‌గేట్లు ఎత్తివేత - gates lift
నాగార్జునసాగర్‌లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 5.10 లక్షల క్యూసెక్కుల ఉండగా ఔట్ ఫ్లో 38 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 543.80 అడుగులకు చేరింది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున రేపు ఉదయం 8గంటలకు సాగర్ క్రస్ట్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.
నాగార్జునసాగర్‌లో ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 543.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 5.10 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 38 వేల క్యూసెక్కులు ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 194.63 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున క్రస్ట్‌గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు. రేపు ఉదయం 8 గంటలకు సాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల చేయనున్నారు సాగర్ అధికారులు.