ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ... ప్రభుత్వం నిర్ణంయం తీసుకోవటంపై గుర్తింపు కార్మిక సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఈయూ నేత దామోదర్ మాట్లాడుతూ... విలీనం కమిటీకి ఆర్టీసీ సంఘాలు ఇచ్చిన డిమాండ్లను పరిశీలించాలన్నారు. కార్మికులు కోరినట్లుగా..విలీనమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఈయూ హర్షం - Eu feeling happy on government decision
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల కార్మిక సంఘం నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాము కోరినట్లుగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్టీసీ ఈయూ హర్షం