ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా 32వ రహదారి భద్రత మాసోత్సవ కార్యక్రమాలు - కడపో రోడ్డు భద్రతా మాసోత్సవాలు

రాష్ట్రవ్యాప్తంగా 32వ రహదారి భద్రత మాసోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వివిధ జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాల నుంచి ర్యాలీలు చేపట్టారు. రహదారి ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 32వ రహదారి భద్రత మాసోత్సవ కార్యక్రమాలు

By

Published : Jan 23, 2021, 6:02 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32వ రహదారి భద్రత మాసోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రమాదాల నివారణకు రహదారి నియమాలను పాటిస్తూ చోదకులు వాహనాలు నడపాలన్నారు.

కడపలో..

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని కడప డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, శాంతకుమారి అన్నారు. 32వ రహదారి భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకొని ఈ రోజు కడపలో పోలీసు-రవాణా శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోటిరెడ్డి కూడలి నుంచి నగర వీధుల్లో తిరుగుతూ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లకార్డులు పట్టుకొని హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువమంది వాహనదారులు మృత్యువాత పడుతున్నారన్నారు. కడప జిల్లాలో ప్రతి ఏడాది సుమారు 400 నుంచి 500 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టు ధరించి వాహనాలను నడపాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలు జరగవని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో..

మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. పాలెంలోని వెహికల్ బ్రేక్ ఇన్​స్పెక్టర్​ కార్యాలయం నుండి ఆత్మకూరు పట్టణం వరకు ర్యాలీ సాగింది.

విశాఖ జిల్లాలో

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ జీసీ రాజారత్నం అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంబీరం రవాణాశాఖ కార్యాలయంలో 32వ జాతీయ భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. గంభీరం జాతీయ రహదారి నుంచి ఆర్టీవో కార్యాలయం వరకు వాహనదారులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డిప్యూటీ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ రాజారత్నం ప్రారంభించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్అండ్​బీ అతిథి గృహము వద్ద 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహన చోదకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు పాటించే నియమాల గురించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఫ్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. మానవహారంగా నిలబడి నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:'విధులకు మేం హాజరుకాము.. వచ్చే వారితోనే చేయించుకోండి'

ABOUT THE AUTHOR

...view details