ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB GRMB Gazette Notification: గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతిపై నేడో, రేపో సమీక్ష..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నదీ యాజమాన్య బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్(KRMB GRMB Gazette Notification) ఈ నెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే.. ఇప్పటికీ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించకపోవటం వల్ల.. గెజిట్ నోటిఫికేషన్(KRMB GRMB Gazette Notification) అమలు పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ ఇవాళో, రేపో సమీక్షించనుంది.

By

Published : Oct 21, 2021, 6:40 AM IST

KRMB GRMB Gazette Notification
KRMB GRMB Gazette Notification

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేషన్(KRMB GRMB Gazette Notification) అమలు పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ నేడో, రేపో సమీక్షించనుంది. జలశక్తి శాఖ గెజిట్ ప్రకారం నోటిఫికేషన్(KRMB GRMB Gazette Notification) ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలు.. బోర్డులకు ప్రాజెక్టులను స్వాధీనం చేయలేదు. దీంతో ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి రాలేదు.

బోర్టులు ఛైర్మన్లతో సమీక్ష...

ఈ నేపథ్యంలో గెటిట్​ నోటిఫికేషన్(KRMB GRMB Gazette Notification)​ అమలు పురోగతిని కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమీక్షించనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్​లతో దేవశ్రీ వర్చువల్ విధానంలో సమావేశం కానున్నారు. ఇవాళో, రేపో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు కసరత్తు, పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. బోర్డులు చేసిన కసరత్తు, తీర్మానాలు, రాష్ట్రాల స్పందనను ఛైర్మన్లు దేవశ్రీ ముఖర్జీకి వివరించనున్నారు.

కొనసాగుతోన్న తెలంగాణ అధ్యయనం

మరోవైరు.. ప్రాజెక్టులు స్వాధీనం చేయాలంటూ బోర్డుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వ అధ్యయనం కొనసాగుతోంది. ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిన్న సమావేశమైంది. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. చట్టాలు, నిబంధనలు, బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు లోబడి ప్రాజెక్టుల స్వాధీనం ఏ మేరకు సాధ్యమన్న విషయమై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఏం జరుగుతోందంటే..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నదీ యాజమాన్య బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది (KRMB and GRMB Gazette issue). జులైలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి రెండు బోర్డులు కసరత్తు చేస్తూనే ఉన్నాయి. బోర్డుల సమావేశాలు, సమన్వయ సంఘాలు, ఉపసంఘాల సమావేశాలు నిర్వహించింది. అన్ని ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి అవసరం లేదని, గెజిట్ లో మార్పులు చేయాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జలశక్తి శాఖను కోరాయి. రెండో షెడ్యూల్​లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ కొన్నింటిని ప్రాధాన్యక్రమంలో ఆధీనంలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నిర్ణయించాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన బోర్డుల ప్రత్యేక సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.

రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నేరుగా నీటిని తీసుకునే ఔట్​లెట్లన్నింటినీ స్వాధీనం చేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డు తీర్మానించింది. అందులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 15 ఔట్​లెట్లు ఉన్నాయి. పెద్దవాగు మధ్యతరహా ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకునేందుకు గోదావరి బోర్డు నిర్ణయించింది (KRMB and GRMB Gazette issue). రెండు రాష్ట్రాలు కూడా ఇందుకు అంగీకరించాయి. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం బోర్డులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టులు, ఔట్​లెట్లు, వాటికి సంబంధించిన అధికారులు, సిబ్బందిని స్వాధీనం చేయాల్సి ఉంటుంది. బోర్డులు తమంతకు తాముగా వాటిని ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగిస్తేనే వాటిని బోర్డులు వాటిని తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి:ts govt on gazette notification: 'తొందరపాటు లేదు.. ఏపీ షరతులతో సంబంధం లేదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details