ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేసీఆర్​ను నమ్మితే.. జగన్ భవిష్యత్ చీకటే: రేవంత్ రెడ్డి - ఏపీ శాసనమండలి రద్దుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ వ్యాఖ్యలు న్యూస్

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స్నేహం వల్లే మండలిని రద్దు చేయడం వంటి వ్యవస్థల విధ్వంసానికి ఏపీ సీఎం జగన్‌ పూనుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. పక్కరాష్ట్రంలో అస్థిర పరిస్థితులు నెలకొంటే తమకు ఇబ్బంది ఉండదనే జగన్‌కు కేసీఆర్‌ ఈ తరహా సలహాలు ఇచ్చినట్లు అనిపిస్తోందన్నారు. కేసీఆర్‌తో ఇదే రకంగా స్నేహం కొనసాగిస్తే.. జగన్‌తో పాటు ఏపీ భవిష్యత్‌ అంధకారమేనని చెప్పారు.

కేసీఆర్​ను నమ్మితే.. జగన్ భవిష్యత్ చీకటే: రేవంత్ రెడ్డి
కేసీఆర్​ను నమ్మితే.. జగన్ భవిష్యత్ చీకటే: రేవంత్ రెడ్డి

By

Published : Jan 28, 2020, 5:30 AM IST

Updated : Jan 28, 2020, 6:50 AM IST

‘'లోక్‌సభలో బిల్లులు ఆమోదం పొంది రాజ్యసభలో తిరస్కరణ గురవడం.. సెలెక్ట్‌ కమిటీకి పంపడంలాంటి సందర్భాలు ఉన్నాయి. అంతమాత్రాన రాజ్యసభను రద్దు చేయాలనో.. పెద్దల సభ నుంచి సలహాలు, సూచనలు వద్దనో ఏ ప్రధాని చెప్పలేదు. పెద్దల సభలో బిల్లు ఆమోదం పొందనంత మాత్రాన సభనే రద్దు చేయడం దురదృష్టకరం. కేసీఆర్‌ను నమ్మినవారు బాగుపడినట్లు చరిత్రలో లేదు. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి.. 2009లో చంద్రబాబుకి కేసీఆర్‌ వెన్నుపోటు పొడిచారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ను పక్కాగా నమ్మబలికి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు. 2019లో జగన్‌తో జట్టు కట్టారు. ఒక వ్యక్తి నేపథ్యం.. ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలి. కేసీఆర్‌ సలహాలను జగన్‌ పాటిస్తే మాత్రం ఆయనకు భవిష్యత్‌లో చీకటే తప్ప వెలుగు ఉండదు.' దిల్లీలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్​ను నమ్మితే.. జగన్ భవిష్యత్ చీకటే: రేవంత్ రెడ్డి
Last Updated : Jan 28, 2020, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details