డిస్కంలు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన సంస్థలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేకపోతున్నట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. 2021 మార్చి 31నాటికి ఈ సంస్థలు చెల్లించాల్సిన రూ.571.02 కోట్లు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా మారినట్లు వెల్లడించింది. ‘‘విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం, టారిఫ్‌లను పునఃసమీక్షించడంతో ఉత్పత్తి సంస్థల ఆదాయాలపై అనిశ్చితి నెలకొంది. దాంతో బ్యాంకులకు రుణాల చెల్లింపులపై ప్రభావం పడుతోంది. ఫలితంగా బకాయిలు ఎన్‌పీఏలుగా మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో డిస్కంలు బకాయిల చెల్లింపునకు పది నెలలకుపైగా సమయం తీసుకుంటున్నాయి. ఈ జాప్యానికి ఉత్పత్తి సంస్థలకు జరిమానాలు, పరిహారాలు, వడ్డీలు చెల్లించడంలేదు. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఇటీవలి కాలంలో పోటీ బిడ్డింగ్‌ల ద్వారా టారిఫ్ రేట్లను తగ్గించడంతో ఉత్పత్తి సంస్థల అంతర్గత ఆదాయ నిష్పత్తి (రేట్‌ఆఫ్ రిటర్న్) పడిపోతోంది. అత్యధిక వడ్డీరేట్లున్న భారత్ రుణమార్కెట్‌లో తక్కువ టారిఫ్‌లను చూసి రుణాలు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకురావడంలేదు. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ సహా కొన్ని రాష్ట్రాలు టారిఫ్‌లను పునఃసమీక్షించడం మొదలుపెట్టాయి. ఈ పద్ధతి మంచిదికాదు. ఇప్పటికే... దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థలకు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఇచ్చిన రుణాల్లో రూ.2,441.55 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన రుణాల్లో రూ.333.46 కోట్లు, ఆర్‌ఈసీ ఇచ్చిన రుణాల్లో రూ.59 కోట్లు ఎన్‌పీఏలుగా మారాయి. దాంతో ఈ రంగానికి రుణాలు పుట్టడం సవాల్‌గా మారుతోంది’’ అని వివరించింది. విద్యుత్తు టారిఫ్‌లను సమీక్షించకుండా... కేంద్రం క్రియాశీలకంగా వ్యవహరించేలా రాష్ట్రాలకు నచ్చజెప్పాలని స్థాయీసంఘం సూచించింది. ఈ సంస్థల ఆదాయాల భద్రతకు కేంద్రమే లేట్‌పేమెంట్ సర్‌ఛార్జ్ సౌకర్యం కల్పించాలని సిఫార్సు చేసింది. ఏపీలో బయోమాస్ ధరలు పెరగడం, ఒకవేళ ఉన్నా నాణ్యంగా లేకపోవడంతో దాదాపు 10 వరకు బయోమాస్‌ప్లాంట్లు మూతపడే పరిస్థితి వచ్చినట్లు స్థాయీసంఘం వెల్లడించింది.
పునరుత్పాదక ఇంధన సంస్థలకు శాపంగా డిస్కంల బకాయిలు - ఏపీ తాజా సమాచారం
ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన సంస్థలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేకపోతున్నట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. 2021 మార్చి 31నాటికి ఈ సంస్థలు చెల్లించాల్సిన రూ.571.02 కోట్ల ఎన్‌పీఏలుగా మారినట్లు వెల్లడించింది.ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోందని తెలిపింది.
డిస్కం