శేషసాయిబాబు మీడియా సమావేశం అవినీతిని ఎత్తి చూపే పత్రికలకు తాము వ్యతిరేకమని వైకాపా ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ శేషసాయిబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు పత్రికలు అమ్ముడు పోయాయంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నిజాలను బయటపెట్టే మీడియాకు, అన్నదాతసుఖీభవ, పసుపు - కుంకుమ పథకాలకు.. జగన్ వ్యతిరేకమని అమరావతిలో దుయ్యబట్టారు. తెదేపాపై నిందలు వేయడం తప్ప... ప్రజలకు ఏం చేస్తామనే అంశాలను జగన్ ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. వైకాపా తరఫున పోటీ చేసే వారిలో సగం మందికి ఏపీలో ఓటు హక్కు లేదని ఆరోపించారు.