ముస్లింలకు న్యాయం జరగాలంటే ఒక్క భాజపా వల్లనే సాధ్యమవుతుందని తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ముస్లిం వర్గాన్ని అభివృద్ధి చేయడంలో తెరాస విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హిందూ- ముస్లిం విద్వేషాలు ఒవైసీ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
అసదుద్దీన్ మాదిరిగా భాజపా తప్పుడు ప్రచారం చేయదని రాజాసింగ్ స్పష్టం చేశారు. పాతబస్తీలో వరదలతో నష్టపోయిన ఏ ఒక్క ముస్లిం కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయనకి ఓటు వేయరని అసదుద్దీన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన అల్లుడు చనిపోవడంతో ఎన్నికల ప్రచారానికి వెళ్లడంలేదని తెలిపారు.