వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈనెల 8వ తేదీ నాటికి మరొక అల్పపీడనం అండమాన్ తీరానికి దగ్గరగా ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మోస్తారు నుంచి విస్తారంగా కురిశాయి.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రంలో వర్షపాతం వివరాలు.. సెంటీ మీటర్లలో..
ఉప్పలగుప్తం | 4.5 |
పూసపాటిరేగ | 4.4 |
విశాఖపట్నం | 4 |
కిర్లంపూడి | 2.6 |
హీరమండలం | 2.4 |
లింగపాలెం | 2.3 |
ఇచ్చాపురం | 2.2 |
సెత్తూరు | 1.4 |
నాగలపురం | 1 |