ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారీ వర్షాలొస్తున్నాయ్.. జాగ్రత్త - weather effect

వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

rain forecast

By

Published : Sep 3, 2019, 5:43 PM IST

Updated : Sep 3, 2019, 7:25 PM IST

మళ్లీ వర్షాలొస్తున్నాయ్.. జాగ్రత్త

వాయవ్య బంగాళాఖాతంలోఅల్పపీడనంకొనసాగుతోంది.ఉత్తరాంధ్రలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఆర్టీజీఎస్‌ అప్రమత్తం చేసింది.ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర ఒడిశా, ఛత్తీస్ ఘడ, మహారాష్ట్ర లపై 1.5 కిలోమటర్ల నుంచి 7 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న కారణంగా రాగల 72 గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు 2.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశాలున్నాయి. ఈ కారణంగా..ప్రజలు ఎవరూ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.చేపలు వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాలులు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయని తెలిపారు.

Last Updated : Sep 3, 2019, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details