ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్రానికి సంబంధం లేదనడం సరికాదు' - raghu rama krishna raju on phnone tapping

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై విచారణ చేసి, కారకులపై చర్యలు తీసుకుంటారని ఎంపీ రఘురామకృష్ణరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్రానికి సంబంధం లేదనేది అసంబద్ధం అని రఘురామకృష్ణరాజు అన్నారు. తరచూ పీఎస్‌ల చుట్టూ తిప్పి జేసీ ప్రభాకర్‌ కరోనా బారినపడేలా చేశారని ఆరోపించారు. వినాయక మండపాలకు ఆటంకాలు కలిగించవద్దని సీఎంను రఘురామరాజు కోరారు

raghu ram krishna raju on phone trapping
ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Aug 19, 2020, 4:22 PM IST

ఫోన్‌ ట్యాపింగ్‌పై తాను కూడా ఫిర్యాదు చేశానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై విచారణ చేసి, కారకులపై చర్యలు తీసుకుంటారని... ఎంపీ రఘురామకృష్ణరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాను రాసిన లేఖ ఆధారంగా ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు చెప్పారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని.. ఓ జాతీయ పార్టీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్రానికి సంబంధం లేదనేది అసంబద్ధం అని పేర్కొన్నారు

చిన్న పెట్టీ కేసు పెట్టి జేసీ ప్రభాకర్‌ను జైల్లో పెట్టి వేధిస్తున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు. తరచూ పీఎస్‌ల చుట్టూ తిప్పి జేసీ ప్రభాకర్‌ కరోనా బారినపడేలా చేశారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ రాగద్వేషాలకు అతీతంగా పాలించారని.. పాలకులు కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజోపయోగమైన చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినాయక మండపాలకు ఆటంకాలు కలిగించవద్దని సీఎంను రఘురామరాజు కోరారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే ఆటంకం కలిగించవద్దని పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ వినాయకచవితి అని.. రాష్ట్ర ప్రభుత్వం విఘ్నం కలిగిస్తే హిందువుల మనోభావాలను గాయపరచడమే అని రఘురామ రాజు అన్నారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు

ఇదీ చదవండి: కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details