భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడం వల్ల కలెక్టర్ ఎంవీ రెడ్డి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జాలర్లు, ఈతకు వెళ్లేవారు గోదావరి వద్దకు వెళ్లకూడదని ఆదేశించారు. ఆయా మండలాల్లోని అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ... గోదావరి తీవ్రతను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి... 44.8 అడుగులకు చేరిన నీటిమట్టం - ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం కల్లా 43 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వద్ద ప్రవహిస్తోంది.
quote-flowing-godari
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీరు పెరగడం వల్ల భద్రాచలంలోని స్నానఘట్టాల ప్రాంతం విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగి పోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీత వాగు ఉద్ధృతంగా ప్రవహించగా నార చీరాల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది.
ఇదీ చదవండి:'సరిహద్దు దాటితే గుణపాఠమే- లద్దాఖ్ ఘటనే సాక్ష్యం'