అమరావతి కోసం అన్ని వర్గాల వారు ఏకమవుతున్నారు. రాజకీయ పార్టీల నేతలు, ఐకాస సభ్యులు, మహిళలు, విద్యార్థులు అంతా కలిసి రాజధాని కోసం పోరాడుతున్నారు. కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో 'మూడు రాజధానులు వద్దు - ఒక రాజధాని ముద్దు' అంటూ నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
గుంటూరులో ఎంఈవోపై ఐకాస నేతల ఆగ్రహం
గుంటూరు జిల్లా తాడికొండ మండల విద్యాశాఖాధికారి వైఖరిపై అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి మద్దతుగా ఇవాళ గుంటూరు జిల్లాలో ఐకాస నేతలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వగా.. తాడికొండ మండల విద్యాశాఖాధికారి ఇందిర... ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల యజమానులకు ఫోన్ చేసి స్కూళ్లు తెరవాలని ఆదేశించారు. బంద్ పాటించవద్దని సందేశాలు పంపారు. విషయం తెలుసుకున్న అఖిలపక్ష నేతలు స్పందన కార్యక్రమంలో ఉన్న ఎంఈవో వద్దకు చేరుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనలో అన్ని వర్గాలు పాల్గొంటుంటే కొందరు అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయటం తగదన్నారు.
భవిష్యత్తు ప్రశ్నార్థకం