'ఎన్నికల ముందు కూటమి అసాధ్యం' - cm_teleconference_in_amaravathi
ఎన్నికల ముందు కూటమి అసాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే ముందస్తుగా కూటమి ఏర్పాటు చేశామన్నారు. అందుకే కేంద్రం కుట్రలు కుతంత్రాలు చేస్తోందని అన్నారు.
కూటమితో భాజపా నేతల్లో భయం పట్టుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో తెదేపా నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి అసాధ్యమని... మేం మాత్రం ముందస్తుగా కూటమి ఏర్పాటు చేశామన్నారు.అందుకే కుట్రలు, కుతంత్రాలు పెంచారని ఆక్షేపించారు.
సాయం చేయరు... చేయనివ్వరు...
ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని కమిటీలు చెప్పాయని మరోసారి గుర్తుచేశారు. అరకొర విపత్తు సాయాన్ని మొయిలీ కమిటీ నిలదీసిందని, తిత్లీ తుపాను పరిహారం సగానికి తగ్గించడాన్ని ప్రశ్నించిందన్నారు. విపత్తుసాయం ఏటా 15 శాతం పెంచాలని మొయిలీ కమిటీ చెప్పిందని చంద్రబాబు స్పష్టం చేశారు. హుద్‌హుద్ పరిహారం ఇంకా రూ.400 కోట్లు రావాలని వెల్లడించారు. కేరళకు దుబాయ్ సాయం చేస్తానంటే కేంద్రం అడ్డుకుందని..రాష్ట్రాలకు నిధులు ఇవ్వరు, ఇతరులను ఇవ్వనివ్వరని సీఎం ఆక్షేపించారు.