- ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టడానికి ముందే ముఖానికి మాస్కు ధరించాలి. వీలైతే వెంట ఒక చిన్న సీసాలో శానిటైజర్‌ను తీసుకెళ్లాలి.
- పోలింగ్ కేంద్రం వద్ద వరుసలో నిలుచున్నపుడు కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి.
- పోలింగ్ సిబ్బంది కచ్చితంగా మాస్కులు, ఫేస్‌షీల్డ్‌లు ధరించడంతో పాటు ఎప్పటికప్పుడూ చేతులు శుభ్రపర్చుకోవాలి.
- పోలింగ్ కేంద్రం లోనికి వెళ్లాక.. గుర్తింపు కార్డును అక్కడి అధికారులకు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ పుస్తకంలో సంతకం చేయాల్సి ఉంటుంది. పోలింగ్ సిబ్బంది ఇచ్చే బ్యాలెట్ పత్రాన్ని, ఓటు ముద్రిత స్టాంపును కూడా చేత్తో తీసుకోవాల్సి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఒకరి నుంచి మరొకరికి వస్తువులు చేతులు మారతాయి. అజాగ్రత్తగా ఉంటే వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది.
- సాధారణంగా పోలింగ్ బూత్ ఒక గదిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో గాలి, వెలుతురు బాగా ఉండే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లు కూడా కచ్చితంగా మాస్కు ధరించాలి.
- అవకాశం ఉంటే పోలింగ్ కేంద్రం లోనికి, వెలుపలకు వెళ్లడానికి వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయడం మంచిది.
- ఇవీచూడండి:అమరావతే ఆకాంక్ష...ఆత్మవిశ్వాసంతో పోరాటం