ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐపీపీబీ ఖాతాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్​ మెుదటి స్థానం - postal department mega mela news

రాష్ట్రవ్యాప్తంగా కనెక్ట్ ఇండియా పోస్ట్ విత్ మిషన్ ప్రాస్పరిటీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ తపాల శాఖ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్​మాస్టర్ జనరల్ రామ్​భరోసా వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్​కు దేశంలోనే మెుదటి స్థానం

By

Published : Nov 15, 2019, 8:28 AM IST

ఆంధ్రప్రదేశ్​కు దేశంలోనే మెుదటి స్థానం
కనెక్ట్ ఇండియా పోస్ట్ విత్ మిషన్ ప్రాస్పరిటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్​మాస్టర్ జనరల్ రామ్​భరోసా వెల్లడించారు. ఇవాళ, 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మెగా మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐపీపీబీ, పొదుపు ఖాతాలను అనుసంధానం చేయటం, అర్హులైన ప్రజలందరికీ అటల్ పెన్షన్ యెజన పెన్షన్, 12 రూపాయలకే ప్రమాద బీమా స్కీం ప్రారంభించటం వంటి అంశాలను మేళాలో నిర్వహిస్తారని వివరించారు. రాష్ట్రంలో ఆధార్ నమోదు నవీకరణ కేంద్రాలు, పోస్ట్​ ఆఫీసుల ద్వారా పాస్​పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఐపీపీబీ ఖాతాలు కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మెుదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించేందుకు తపాలశాఖ కృషి చేస్తుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details